Monday, August 5, 2013

Idi Naa Barata Khandam


విధ్వసం విద్వేషం విపరీతపు వైకృత్యం పసిపిల్లలపై ఆకృత్యం
ధమన నీతులు ద్రుతరాష్ట్ర కౌగిళ్ళు ... మనునీతుల మాటున
మారణఖాండాలు ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం
కాలుతున్న కాష్టo పై ఆదిపత్యపు పోరులు కారుతున్న కన్నీరు పై
కాసులతో సవారీలు విలువలేని నీతులతో నేతల షికార్లు ..
ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం !!!!
నడి బొడ్డున బొడ్డుపట్టి రచ్చకీడ్చు కీచక రాజకీయలోకవైపు
కలాలు కంగుతినేలా పుకార్లు మరువైపు మరి దళారుల
చేతికి చిక్కీన హలాలు మరి ఎటువైపో ఎటువైపో .....
తరాలు మారినా తలరాతలు మారవనేది జనమెరిగిన సత్యం
జగమెరిగిన సత్యo.. ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం !!!!

No comments:

Post a Comment