Tuesday, September 16, 2008

Evariki Vare

మనది కాని మనం కాని మనుషుల్లా ఉంటాము
మనసు లేని ప్రేమంతా కురిపిస్తాము .....
నీ తోడే నాకీ జగముందని అంటాము
నడి  రేతిరి నన్నొదిలి పొమ్మంటాము !!!

Saturday, August 30, 2008

Janam Leni Jagam

నా కోసం నేనున్నాని అంటాము
జనoతోన పనులేమి లేదంటాము
డబ్బుంటే అన్నీ  మన వెంటే అనుకుంటాము
కానీ మిత్రమా!! జనం లేని జగంలోన
మనమేలున్టాము  మనమేలున్టాము

Monday, August 4, 2008

Chiti

తరం తరం నిరంతరం నిరీక్షనే నిరాశతో
నిస్తేజమైన నిర్వీర్యమైన సమాజంతో నే
సమరమే సాగించన స్వార్దమే అర్దమా
కాసులే పరమార్దమా ..సమస్యలే న
నేస్తమై సవాలుగా నిలచినా నే తలొంచను
చెలించను ..చితికి చితికి నే శ్వాసనే వదిలినా
చితిన సైతం వెలుగునే ఇవ్వనా మంచినే పంచనా
ప్రేమనే  నింపనా.. మంచినే పంచనా ప్రేమనే నింపనా !!!!!

Sunday, July 27, 2008

Chinnadi

సిరిగల చిన్నది సరసమున  వలువలు
విడువగా కన్నార్పక నేనా కౌమారిన్ జూసి
మురిపెముగ ముద్దులిచ్చినంతనా  కౌమారి
సిగ్గులొలక చుండినన్ జగతినన్ వేరేల సౌందర్యము
గానరదె ఏ మగనికైననున్ .....

Wednesday, July 16, 2008

Meccheli

నా కన్నులు మెచ్చిన మెచ్చెలి
వెచ్చగ గిచ్చుతు కవ్వించగ
 మగసిరి ఎగసిన మగనిగా మురిపెముగ
సొగసిరి సిరిగన ఎగసిన శ్వేదముల ఝరిలో
నేనా కాంతకు దాసొహమవనా !!!

Friday, June 13, 2008

Maguva

సరస సల్లాపుములైన గాని మేని సమరాలు అయిన గాని
జగమేలు రేడు కనిన మదినేలు రేడే మగువకు మగధీరుడగున్ ......