Monday, August 5, 2013

Prapancham


వృద్దాప్యoతో  చిక్కి శల్యమై  చావుకై
ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి కదా
ఈ గ్రామాలు !!! చస్తే చితి పెట్టి పరిగెడదామన్నట్లు
ఉన్నాయి కదా ఈ  కుర్రకారు ఉరుకులు ....
ఎదగాలనుకున్న పెద్దవాళ్ళకు ఎదురు చూపులనే మిగిల్చి
రెయ్యిన  ఎదిగి ఎగిరి పోయిన పిల్లలు కనుచూపు మేర కానరాక పాయనే!
హలా!! ఇదేనా నేను కోరుకున్న "కొని" తెచ్చుకున్న ప్రపంచం...
కట్టలు తెంచుకున్న కన్నీరుని ఖాతరు చేయక కాలగర్భంలో
కలసి పోయే  ఘోషలా నన్ను మిగిలి పొమ్మంటు కదిలి
 పొమ్మంటూ కడలిలో కలిసి పోమ్మంటూ నాకై నన్నుగా ఏకాకిగా వదిలిన
ఈ సమాజం లో సాగిస్తున్నానీ జీవన సమరాన్ని గమనిస్తున్నా నీ జీవన
గమకాన్ని అంతిమ చెరలో మృత్యువు ఒడిలో.......



Idi Naa Barata Khandam


విధ్వసం విద్వేషం విపరీతపు వైకృత్యం పసిపిల్లలపై ఆకృత్యం
ధమన నీతులు ద్రుతరాష్ట్ర కౌగిళ్ళు ... మనునీతుల మాటున
మారణఖాండాలు ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం
కాలుతున్న కాష్టo పై ఆదిపత్యపు పోరులు కారుతున్న కన్నీరు పై
కాసులతో సవారీలు విలువలేని నీతులతో నేతల షికార్లు ..
ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం !!!!
నడి బొడ్డున బొడ్డుపట్టి రచ్చకీడ్చు కీచక రాజకీయలోకవైపు
కలాలు కంగుతినేలా పుకార్లు మరువైపు మరి దళారుల
చేతికి చిక్కీన హలాలు మరి ఎటువైపో ఎటువైపో .....
తరాలు మారినా తలరాతలు మారవనేది జనమెరిగిన సత్యం
జగమెరిగిన సత్యo.. ఇదీ నా భరత ఖండం ఇదీ నా భరత ఖండం !!!!

Jana Yogam Oka Yaagam

తలెత్తి చూడు నువ్వు  తమాషాలు ఎన్నో
నిశబ్దాన్ని వీడీ ప్రశ్నించి చూడు నువ్వు
యిలలో అలలా కదిలే ఝారిలా
ఎదురొచ్చే తుఫానుకే నువ్ నిలవాలి ఓ వారధిలా
సవాలుకే నువ్  పెను సవాలువై 
సమాధిలో  బ్రతికే జగానికే జననాయకుడై
నువ్వేసే ప్రతి అడుగే పిడుగై పడదా
ఉరిమే మేరుపైతే అవినీతికి అల్లుళైనా ఉలికేపడరా
 ప్రతి పనిలో నువ్ చేసే త్యాగం  కాదా 
జనసoక్షేమానికి పనికొచ్చే ఒక యాగం
మన వెంటే నడిచోచ్చే జనాలే మనకో యోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం
అది మరణం కూడా దూరం చెయ్యలేని ఒక భోగం

Sunday, August 4, 2013

Chaduvoka Shoonyam

చదువొక శూన్యం బ్రతుకొక సమరం
నిత్యం నరకం చిరాశనే నిరాశగా జీవించే జనం మనం 
ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశులే  పాలకులైనా
చేతకాక చేవ చచ్చి మౌనంగానే చూసేము
బ్రతుకు పోరులో గన్నుల హోరులో నిత్యం పరుగులు పెట్టే
జన జీవనం మనం అలసిన మనసులతో ఆవేదనగా మిగిలే
జనసందోహం మనం జనసందోహం మనం...

Naaya"kulam"

నీతి లేదు భీతి లేదు సిగ్గులేని రాజకీయనాయకులం
నాయకులం అనే పదం లోనే కులం అనే పదాన్ని ఇముడ్చుకుని
కుక్కల వలె నక్కల వలె దేశాన్నే దోచేసే రాజకీయ దురంధురులు
రాజ్యమేలుతుంటే తలవంచుకు తలదించుకు భారతావని ఏడ్చేను
ఆకలి చావులు పేదల కేకలు ఎవరికీ పట్టని ఘోషలై గాలిలోన కలిసేనా
ఎటు పోతుందీ నా ఈ దేశం ఎటు వైపూ మన ఈ పయనం